ఘనంగా యువజనోత్సవాలు

ABN , First Publish Date - 2021-01-13T05:44:09+05:30 IST

యువత అన్ని రంగాల్లో రాణించాలని యువకేంద్ర రాష్ట్ర సంచాలకులు ఆర్‌.వెంకటేశం అన్నారు.

ఘనంగా యువజనోత్సవాలు
యువతకు క్రీడాసామగ్రిని అందజేస్తున్న యువకేంద్ర రాష్ట్ర సంచాలకులు ఆర్‌.వెంకటేశం, ఎస్‌ఎస్‌వీ రమణ

గుంటూరు(తూర్పు), జనవరి12: యువత అన్ని రంగాల్లో రాణించాలని  యువకేంద్ర రాష్ట్ర సంచాలకులు ఆర్‌.వెంకటేశం అన్నారు. మంగళవారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నెహ్రూ యువకేంద్రంలో  ఘనంగా యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని అకాంక్ష మేరకు యువత అన్ని రంగాల్లో రాణించాలన్నారు.   స్వచ్ఛసమ్మర్‌ ఇంట్నషిప్‌-2020లో గెలుపొందిన వారికి నగదు బహుమతితోపాటు, యువజన సంఘాలకు  క్రీడాసామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎస్‌ఎస్‌వీ రమణ, జిల్లా యువ సమన్వయ అధికారి దేవిరెడ్డి కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:44:09+05:30 IST