స్కూల్ పిల్లలపై దాడితో సీఎం తలదించుకోవాలి: నాయబ్ కమాల్ షేక్

ABN , First Publish Date - 2021-11-09T18:15:59+05:30 IST

స్కూల్ పిల్లలపై దాడితో సీఎం జగన్ తలదించుకోవాలని జనసేన నేత నాయబ్ కమాల్ షేక్ అన్నారు.

స్కూల్ పిల్లలపై దాడితో సీఎం తలదించుకోవాలి: నాయబ్ కమాల్ షేక్

గుంటూరు: స్కూల్ పిల్లలపై దాడితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలదించుకోవాలని జనసేన నేత నాయబ్ కమాల్ షేక్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణ కోసం పోరాటం చేస్తామన్నారు. దేశం మొత్తం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాయని, ఒక్క ఏపీలోనే అధిక ధరలు ఉన్నాయన్నారు. పెట్రో ధరలు తగ్గించకపోతే జనసేన పోరాటం చేస్తుందని నాయబ్ కమాల్ షేక్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-11-09T18:15:59+05:30 IST