నరసరావుపేట డివిజన్‌లో... 131 నామినేషన్ల తిరస్కరణ

ABN , First Publish Date - 2021-02-06T05:56:40+05:30 IST

నరసరావుపేట డివిజన్‌లోని 11 మండలాల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. మొత్తం 131 నా మినేషన్లను తిరస్కరించారు

నరసరావుపేట డివిజన్‌లో... 131 నామినేషన్ల తిరస్కరణ

నరసరావుపేట, ఫిబ్రవరి 5: నరసరావుపేట డివిజన్‌లోని 11 మండలాల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. మొత్తం 131 నా మినేషన్లను తిరస్కరించారు. వీటిలో సర్పంచులకు సంబంధించి 36 నామినేషన్లు, వార్డుసభ్యుల నామి నేషన్లు 95 ఉన్నాయి. సర్పంచి నామినేషన్లు  1,219, వార్డు సభ్యుల నామినేషన్లు 5,947 ఆమోదించారు. తిరస్కరించిన నామినేషన్ల సంబంధించి శనివారం అప్పీళ్లను సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో స్వీక రించనున్నట్టు సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌నుపూర్‌ తెలిపారు. 8వ తేదీ 3 గంటలోపు నామినేషన్‌లను ఉపసంహరించుకోవచ్చని పేర్కొన్నారు.  

Updated Date - 2021-02-06T05:56:40+05:30 IST