ప్రజలకు సహనంతో సేవలందించాలి : సబ్‌కలెక్టర్‌ నిధిమీనా

ABN , First Publish Date - 2021-09-02T18:12:00+05:30 IST

వివిధ పనులపై..

ప్రజలకు సహనంతో సేవలందించాలి : సబ్‌కలెక్టర్‌ నిధిమీనా

రేపల్లె: వివిధ పనులపై సచివాలయాలకు వచ్చే ప్రజలకు సహనంతో సేవలందించాలని తెనాలి సబ్‌కలెక్టర్‌ నిధి మీనా చెప్పారు. మండలంలోని కైతేపల్లి, వడ్డీలవారిపాలెం, సింగు పాలెం, పోటుమెరక, గ్రామాల్లోని సచివాలయాలను బుధవారం ఆమె సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు సత్వరమే అందిం చాలనే ఉద్దేశంతో సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిం దన్నారు. పనులకై కార్యాలయాలకు వచ్చే ప్రజలను చిరునవ్వు తో స్వాగతించి సమస్యలపై వారు అందజేసిన ఆర్జీలను సేకరించి సకాలంలో పరిష్కరించేలా పనిచేయాలన్నారు. కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. సచివాలయాలకు వచ్చే ప్రజలకు కొవిడ్‌ నిబంధనలు వివ రించి, పాటించేలా చర్యలు తీసుకో వాలన్నారు. అనంతరం పోటుమెరకలో నూతనంగా ఏర్పాటు చేయ నున్న పెట్రోలు బంక్‌ స్ధలంను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయశ్రీ, ఎంపీడీవో చంద్రసువార్త, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-02T18:12:00+05:30 IST