31న సీఎం కార్యాలయం ముట్టడి

ABN , First Publish Date - 2021-07-08T05:34:56+05:30 IST

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయకపోతే ఈనెల 31న బాధితులతో కలసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యలయాన్ని ముట్టడి చేస్తామని సీపీఎం రాష్ట్ర సహయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు.

31న సీఎం కార్యాలయం ముట్టడి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముప్పాళ్ల, పాల్గొన్న జంగాల అజయ్‌కుమార్‌, కోటా మాల్యాద్రి

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి

ముప్పాళ్ల నాగేశ్వరరావు

గుంటూరు(తూర్పు), జూలై7: అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయకపోతే ఈనెల 31న బాధితులతో కలసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యలయాన్ని ముట్టడి చేస్తామని సీపీఎం రాష్ట్ర సహయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. కొత్తపేట మల్లయ్య లింగంభవనలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారంరోజుల్లోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామన్న ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 101 వారాలైనా వారిని పట్టించుకోవడం లేదన్నారు. నిరసనల్లో భాగంగా ఈనెల 15న వైసీపీ ఎమ్యెల్యేలు, ఇనచార్జులకు వినతిపత్రాలు అందజేయడం, ఈనెల 30న అగ్రిగోల్డ్‌ బాధితులతో సచివాలయం వరకు విజ్ఞాపన ర్యాలి వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. కృష్ణా జలాల విషయంలో చట్టప్రకారం పంపకాలు జరగాలన్నారు. సమావేశంలో సీపీఐ నాయకులు జంగాల అజయ్‌కుమార్‌, కోటా మాల్యాద్రి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-08T05:34:56+05:30 IST