రెండో దశకు.. సన్నాహాలు

ABN , First Publish Date - 2021-03-23T05:04:58+05:30 IST

రాష్ట్రంలో ఇటీవల తొలిదశలో మునిసిపల్‌ ఎన్ని కలు పూర్తయ్యాయి. అయితే మున్సిపల్‌ పట్టణాలకు సమీపంలోని పంచాయతీల విలీనం పై కోర్టు వివా దాల నేపథ్యంలో కొ న్నింటిలో ఎన్నికలు నిర్వహిం చలేదు.

రెండో దశకు.. సన్నాహాలు
నరసరావుపేట మున్సిపాలిటీ

త్వరలో ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు

వార్డుల విభజన, రిజర్వేషన్లపై అధికారుల దృష్టి

వార్డుల డీ లిమిటేషన్‌ తుది జాబితా 29న విడుదల

 

రెండోదశలో ఎన్నికలు జరిగే మునిసిపాలిటీలు

గ్రేడ్‌ 1 : బాపట్ల, నరసరావుపేట

గ్రేడ్‌ 2 : పొన్నూరు

నగర పంచాయతీలు : గురజాల, దాచేపల్లి


 

 (గుంటూరు - ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రంలో ఇటీవల తొలిదశలో మునిసిపల్‌ ఎన్ని కలు పూర్తయ్యాయి. అయితే మున్సిపల్‌ పట్టణాలకు సమీపంలోని పంచాయతీల విలీనం పై కోర్టు వివా దాల నేపథ్యంలో కొ న్నింటిలో ఎన్నికలు నిర్వహిం చలేదు. జిల్లాలో ఏడు చోట్ల ఎన్నికలు జరగ లేదు. మంగళగిరి, తాడేపల్లి మునిసి పాలిటీల వివాదం ఇంకా కోర్టులోనే ఉంది. వీటిని మినహాయించి పొ న్నూ రు, బాపట్ల, నరసరావుపేట మునిసి పాలిటీలకు, గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలకు ఎన్నిక లను రెండోదశలో జరప డానికి అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ప్రభు త్వ ఆదేశాల మేరకు వా ర్డుల డీ లిమిటేషన్‌ ప్రక్రి య పూర్తయింది. ఈ నెల 12న వార్డుల ముసాయిదా ప్రకటించారు.  వార్డుల డీ లిమిటేషన్‌ తుది జాబితా గజిట్‌ను ఈ నెల 29న ప్రకటించేందుకు అధికారులు సిద్ధమయ్యా రు. రెండో దశలో ఎన్నికలు జరిగే ఐదు మునిసిపా లిటీల్లో వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీల ఓట్ల గుర్తింపు, వార్డుల రిజర్వేషన్లు తదితర అం శాలకు సంబంధించి ఆయా పురపాలక సంఘాల అధికారులకు మునిసిపల్‌ డైరెక్టరేట్‌, ఆర్‌జేడీ కార్యా లయాల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. వచ్చే నెల 15లోగా వీటికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని అధికారులు సూచనలు జారీ చేసినట్లు తెలిసింది. దాచేపల్లి, గురజాల పట్టణ పరిధిలో కొచ్చి న తరువాత తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి.


మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం

జిల్లాలో ఐదు మండలాల పరిధిలోని సుమారు 25 గ్రామాలు పట్టణ పరిధిలోకి వచ్చాయి. దీంతో ఆయా పంచాయతీల్లో ఎన్నికలు నిర్వ హించలేదు. నరసరావుపేట మున్సిపాలిటీలో యలమంద, లింగం గుంట్ల, కేసానుపల్లి, రావిపాడు, ఇసప్పాలెం, పొన్నూ రు మున్సిపాలిటీలో చింతలపూడి, కట్టెంపూడి, కసు కర్రు, పెదఇటికంపాడు, వడ్డిముక్కల, ఆలూరు, బాపట్ల మున్సిపాలిటీలో కొం డబొట్లవారిపాలెం, ము త్తాయపాలెం, మరుప్రోలువారిపాలెం, తూర్పుబాపట్ల, పశ్చిమబాపట్ల, అడవి పంచాయతి శి వారు గ్రామాలు రామ్‌నగర్‌, ఆదర్శ నగ ర్‌, సూర్యలంక, పిన్నెబోయిన వారి పాలెం శివారు గ్రామం వల్లువారి పా లెం విలీనమ య్యాయి. నగర పం చాయతీలైన గురజాలలో జంగమహేశ్వ రపురం, గురజాల, దాచేపల్లిలో నడి కూడి, దాచేపల్లిలు కలిశాయి.


ప్రతిపక్షాలు  కోలుకునేలోపే ఎన్నికలు..

తొలిదశలో జరిగిన ము న్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ సహా ప్రతిపక్షాలకు   అవ కాశం లేకుండా పోయింది. గుంటూరు సహా ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా అన్నిం టిలోనూ వైసీపీనే అధికారం చే పట్టింది. మాచర్ల, పిడుగు రాళ్లలో అయితే వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలే జరగలేదు. ఈ పరిస్థితుల్లో రెం డో దశలో ఎన్నికలు జరిగే మున్సి పాలిటిల్లోనూ ప్రతి పక్షాలకు అవకాశం లేకుండా చేసేందుకు వైసీపీ నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రతి పక్షం తొలిదశలో జరిగిన లోపాలను సవరిం చుకుని ఎన్నికలకు సమాయత్తం అయ్యే లోపు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార పక్షం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెలా ఖరుకు నిమ్మగడ్డ పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత వచ్చే నూతన ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో రెండో దశ మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు అధి కారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో పల్నాడు లోని మాచర్ల, పిడుగురాళ్ళ మునిసిపాలిటీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి. రెండోదశలో గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల ఎన్నికలు జరగబోతు న్నాయి. ఈ రెండు చోట్ల కూడా తొలిదశ మాదిరిగానే ఏకగ్రీవం చేసుకోవాలని అధికారపార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. 


 

 

Updated Date - 2021-03-23T05:04:58+05:30 IST