మేముసైతం..

ABN , First Publish Date - 2021-12-09T05:15:31+05:30 IST

ex mla yarapathineni

మేముసైతం..
పాదయాత్ర చేస్తున్న యరపతినేని దంపతులు

రైతులతో కలసి యరపతినేని దంపతుల పాదయాత్ర 

పిడుగురాళ్ల, డిసెంబరు8: న్యాయస్థానం టు దేవస్థానం వరకు అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో గురజాల మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు, నాగమణి దంపతులు బుధవారం పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కాళహస్తి సమీపంలో 45వ రోజు కొనసాగుతున్న మహాపాదయాత్రలో యరపతినేని పాల్గొని జై అమరావతి నినాదాలు చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అమరావతే రాజధానిగా కొనసాగుతుందన్నారు. వందలాది మంది మహిళలు చేస్తున్న పాదయాత్రకు తగిన ఫలితం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంచేటి శివ, యరపతినేని నిఖిల్‌, వేములపల్లి వెంకటనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-09T05:15:31+05:30 IST