రెండేళ్ల తర్వాతే రాజీనామా చేస్తా
ABN , First Publish Date - 2021-11-28T05:41:56+05:30 IST
రెండేళ్ల తర్వాతే ఎంపీపీ పదవికి తాను రాజీనామా చేస్తానని కర్లపాలెం ఎంపీపీ యారం వనజ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆమె శనివారం స్వయంగా మీడియా ముందు వెల్లడించారు.

కర్లపాలెం ఎంపీపీ యారం వనజ
బాపట్ల, నవంబరు 27: రెండేళ్ల తర్వాతే ఎంపీపీ పదవికి తాను రాజీనామా చేస్తానని కర్లపాలెం ఎంపీపీ యారం వనజ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆమె శనివారం స్వయంగా మీడియా ముందు వెల్లడించారు. దీంతో ఎంపీపీ పదవి మార్పు విషయం రసకందాయంలో పడింది. ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించిన దొంతిబోయన ఝాన్సీలక్ష్మి ఫలితాలకు ముందే మృతి చెందారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె కోడలు లక్ష్మీసామ్రాజ్యం ఎంపీటీసీగా గెలిచింది. ఈ వ్యవధిలో వనజను ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఇప్పుడు లక్ష్మీసామ్రాజ్యానికి పదవి కట్టబెట్టాలనే ఆలోచన తెరమీదకొచ్చింది. ఇప్పటికిప్పుడు పదవి నుంచి తొలగిపోవాలని రాజీనామా లేఖ కూడా సిద్ధం చేసి వనజకు అందజేశారు. కానీ ఆమె సంతకం చేయలేదు. దీంతో మండలపరిషత్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పార్టీశ్రేణులతో కలిసి ఆమెతో చర్చించారు. అనంతరం జరిగిన మండలపరిషత్ సమావేశంలో కోన మాట్లాడుతూ వైసీపీ మండల అధ్యక్షుడు డి.సీతారామిరెడ్డి కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ఎంపీపీ పదవి కట్టబెట్టాలని సూచించారు. అయితే ఎక్కడా వనజను రాజీనామా చేయించాలనే అంశాన్ని ప్రస్తావించలేదు.