పీఈటీ పోస్టులు భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2021-03-14T05:52:14+05:30 IST

ప్రాథమికోన్నత పాఠశాలల్లో పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.బుజ్జిబాబు విజ్ఞప్తిచేశారు.

పీఈటీ పోస్టులు భర్తీ చేయాలి
ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు వినతిపత్రం అందజేస్తున్న సంఘం నాయకులు

గుంటూరు(విద్య), మార్చి 13: ప్రాథమికోన్నత పాఠశాలల్లో పీఈటీ పోస్టులు భర్తీ  చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.బుజ్జిబాబు విజ్ఞప్తిచేశారు. ఈవ ేురకు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు వినతిపత్రం అందజేశారు. జీవోనం 29 ప్రకారం 400మంది విద్యార్థులు దాటిన ప్రతి పాఠశాలలో ఒక పీఈటీని నియమించాలని కోరారు. పాఠశాలల్లో ఫిజికల్‌ లిటరసీని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డితో  ఆయా సమస్యలు చర్చించాలని కోరారు.


Updated Date - 2021-03-14T05:52:14+05:30 IST