వైసీపీ శ్రేణుల దాడులు సరైనవే: MP mopidevi

ABN , First Publish Date - 2021-10-20T18:39:44+05:30 IST

రాజకీయ చరిత్రలో నిన్నటి రోజు ఓ దుర్దినమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు.

వైసీపీ శ్రేణుల దాడులు సరైనవే: MP mopidevi

గుంటూరు: రాజకీయ చరిత్రలో నిన్నటి రోజు ఓ దుర్దినమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు తమ ఉనికి కోల్పోతుందని భయం పట్టుకుందని తెలిపారు. భయంతోనే పెయిడ్ ఆర్టిస్ట్ పట్టాభి లాంటి వారితో ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. పట్టాభి మాట్లాడే బాష వింటుంటే రక్తం మరిగిపోతుందన్నారు. వైసీపీ శ్రేణుల దాడులు సరైనవే అని అన్నారు. టీడీపీ బాష అలా ఉంటే వైసీపీ ప్రతి చర్య ఇలానే ఉంటుందని తెలిపారు. చంద్రబాబు, అతని అనుచరులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఎంపీ మోపిదేవి హెచ్చరించారు. 

Updated Date - 2021-10-20T18:39:44+05:30 IST