డీసీఎంఎస్ ప్రతిష్ఠను పెంచాలి
ABN , First Publish Date - 2021-07-24T05:30:00+05:30 IST
కొత్తపాలకవర్గం డీసీఎంఎస్ ప్రతిష్ఠను పెంచాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ సూచించారు.

కొత్త పాలకవర్గానికి ఎంపీ మోపిదేవి సూచన
గుంటూరు, జూలై 24(ఆంధ్రజ్యోతి): కొత్తపాలకవర్గం డీసీఎంఎస్ ప్రతిష్ఠను పెంచాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ సూచించారు. గుంటూరులోని జాగర్లమూడి చంద్రమౌళి సహకార భవనలో శనివారం డీసీఎంఎస్ చైర్పర్సనగా యార్లగడ్డ భాగ్యలక్ష్మి బాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జీఎం హరగోపాలం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ మోపిదేవి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సకాలంలో, సక్రమంగా అందించాలన్నారు. జిల్లావ్యాప్తంగా డీసీఎంఎస్ శాఖలను విస్తరింపచేయాలని, సంస్థ ఆస్తులను కాపాడాలని సూచించారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు దరకు డీసీఎంఎస్ కొనుగోలుచేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రైతులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, మేయర్ కావటి మనో హర్ నాయుడు, డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు, డీసీసీబీ చైర్మన లాల్పురం రాము, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన క్రిస్టినా, నల్లపాటి రామయ్య, జడ్పీ సీఈవో చైతన్య, బిజినెస్ మేనేజర్ శ్రీనివాసరావు, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. చైర్పర్సనతో పాటు ఆరుగురు డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. చైర్పర్సన భాగ్యలక్ష్మి, మదన దంపతులను ఎంపీ మోపిదేవి, మాజీ ఎమ్మెల్యే దేవినేని, మాజీ ఎంపీవీ వాసు గజమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.