గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనను పొడిగించండి

ABN , First Publish Date - 2021-11-24T05:20:27+05:30 IST

కొవిడ్‌ మహమ్మారితో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతోన్న ప్రజానీకానికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం ఓ లేఖలో ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు.

గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనను పొడిగించండి
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

ప్రధానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ

గుంటూరు, నవంబరు 23: కొవిడ్‌ మహమ్మారితో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతోన్న ప్రజానీకానికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం ఓ లేఖలో ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ మహమ్మారి వలన ప్రభావితమైన కోట్లాది కుటుంబాల ఆహార భద్రత కోసం ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ పేర్కొన్నారు. మొత్తం 4 దశల్లో రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చుతో 500 టన్నులకు పైగా మంచి ధాన్యాన్ని రాషా్ట్రలకు కేటాయించటం జరిగిందని, ప్రస్తుతం ఈ పథకం నాలుగో దశ నవంబరు 30తో ముగస్తుందని, ఈ పథకాన్ని మరింత పొడిగించటం లేదని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎంపీ లేఖ రాశారు. ఈ పథకం గడువు మరో ఆరు నెలల పాటు   పొడిగించాలని, వ్యక్తిగతంగా పరిగణలోకి తీసుకొని పరిశీలించాలని ప్రధానికి రాసిన లేఖలో కోరారు. 

Updated Date - 2021-11-24T05:20:27+05:30 IST