మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వైసీపీ విజయం

ABN , First Publish Date - 2021-02-26T05:56:36+05:30 IST

రానున్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వైసీపీ విజయం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తదితరులు

గుంటూరు, ఫిబ్రవరి 25: రానున్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు వజ్రాల రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన అరండల్‌పేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి దరి చేరుతున్నాయన్నారు. తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన దానికంటే అధికంగా  నగరపాలక సంస్థలో ఫలితాలు వస్తాయన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ   వలంటీర్‌ వ్యవస్థతో పారదర్శకంగా పథకాలు అందిస్తూ జగన్‌ కొత్త ఒరవడిని సృష్టించారన్నారు. సమావేశంలో వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, కావటి మనోహర్‌నాయుడు, లీగల్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్‌ మనోహర్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు పోలూరి వెంకటరెడ్డి, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, బోడపాటి కిరణ్‌ తదితరులున్నారు.

  

Updated Date - 2021-02-26T05:56:36+05:30 IST