భగవద్గీతను అధ్యయనం చేయాలి

ABN , First Publish Date - 2021-12-15T05:41:33+05:30 IST

మానవుడి అన్నిదశల్లో వచ్చే సమస్యల్ని అఽధిగమించడానికి భగవద్గీత దిక్సూచిగా ఉపయోగ పడుతుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు.

భగవద్గీతను అధ్యయనం చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌

గుంటూరు(విద్య/సాంస్కృతికం), డిసెంబరు14: మానవుడి అన్నిదశల్లో వచ్చే సమస్యల్ని అధిగమించడానికి భగవద్గీత దిక్సూచిగా ఉపయోగ పడుతుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. ఆది జాంబవ అరుంధతి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని శ్రీమేధాలో జరిగిన గీతాజయంతి సభలో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు భగవద్గీతను అధ్యయనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో చెరుకుపల్లి ఆదిశేషావతారం, ఆది జాంబవ అరుంధతి ట్రస్ట్‌ అధ్యక్షుడు ఎస్‌.బాలస్వామి, దర్శనపు శ్రీనివాస్‌, శ్రీమేధా డైరెక్టర్‌ అన్నా నందకిషోర్‌, 

హనుమత్‌ప్రసాద్‌, ఏసుదాసు, మోహనరావు, సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

హిందూ కళాశాలలో..

భగవద్గీత నేటి యువతకు మార్గదర్శి అని కళాశాల హిందూ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీఎన్‌ దీక్షిత్‌ అన్నారు. మంగళవారం హిందూ కళాశాల ప్రాంగణంలో అక్షరసాహితీసమితి ఆధ్వర్యంలో గీతాజయంతిని పురస్కరించుకుని భగవద్గీత పోటీల విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. సభలో అధ్యాపకులు డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు, షేక్‌ బాజి, ఆలూరి నటరాజ కుమారి, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

 గీతా పారాయణం

బృందావన్‌ గార్డెన్స్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ - లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో గీతాజయంతి సందర్భంగా సాహితీవేత్త డాక్టర్‌ కేవీ శ్రీరంగనాయకి బృందం పారాయణం చేశారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు, డాక్టర్‌ మిక్కిలినేని రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సభలో డాక్టర్‌ శాఖమూరి శివరాంబాబు అర్జునాదేవి రచించిన వేదం సృష్టి విజ్ఞానం, శ్రీమద్భగవద్గీత గ్రంఽథాలను ఆవిష్కరించారు. 

రామనామక్షేత్రంలో..

స్థానిక సంపత్‌నగర్‌ రామనామ క్షేత్రంలో మంగళవారం గీతాజయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి.  మహిళా బృందం ఆధ్వర్యంలో గీత 18 అధ్యాయాలను పారాయణం చేశారు. కార్యక్రమంలో బెల్లంకొండ మస్తాన్‌రావు, ఆర్‌.వెంకట లీలాసుందరి తదితరులు పాల్గొన్నారు.

టీజేపీఎస్‌ కళాశాలలో..

 స్థానిక టీజేపీఎస్‌ కళాశాలలో మంగళవారం గీతాజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.అనితాదేవి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.భానుమురళీధర్‌, కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ జేవీ సుధీర్‌కుమార్‌, డాక్టర్‌ పి.బలరామ్‌, డాక్టర్‌ పి.దేవేంద్రగుప్త, డాక్టర్‌ ఎ.అంజనీకుమార్‌, ఆర్‌.జయశైలజ, జి.సురేష్‌కుమార్‌, పి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-15T05:41:33+05:30 IST