ఇసుక క్వారీయింగ్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే శంకరరావు

ABN , First Publish Date - 2021-05-18T06:11:55+05:30 IST

తక్కువ ధరకు ఇసుకను అందించే లక్ష్యం తో రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే నం బూరు శంకరరావు అన్నారు.

ఇసుక క్వారీయింగ్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే శంకరరావు
టెంకాయ కొట్టి ఇసుక లోడింగ్‌ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శంకరరావు

అమరావతి, మే 17: తక్కువ ధరకు ఇసుకను అందించే లక్ష్యం తో రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే నం బూరు శంకరరావు అన్నారు. సోమవారం జేపీ గ్రూప్‌ ఆధ్వ ర్యంలో అమరావతిలో ఇసుక క్వారీయింగ్‌ ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని ఇసుక రీచ్‌లు తెరవనున్నట్లు చెప్పారు. ఇసుక ఆవశ్యకత ఉన్న వారు రీచ్‌ వద్దనే టన్నుకు రూ.475 చెల్లించి తీసుకెళ్లవచ్చన్నారు. కార్యక్రమంలో జేపీ గ్రూప్‌ ప్రతినిధులు లోకేష్‌, శ్రీనివాస్‌, వైసీపీ నాయకులు కంచే టి సాయిబాబు, ఉపసర్పంచ్‌ నిమ్మా విజయసాగరబాబు, ఎన్‌ శివ య్య పాల్గొన్నారు. అనంతరం ధ్యానబుద్ధ ప్రాజెక్టు సమీపంలో ఏర్పా టుచేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను సందర్శించి రోగు లకు అందుతున్న సేవలను పరిశీలించారు. సెంటర్‌లో ప్రస్తుతం 50 పడకలు వినియో గిస్తున్నారని అదనంగా 10 పడకలను పెంచాలని వైద్యులను ఆదేశిం చారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వద్ద పోలీసు పహారా ఉండేలా చర్యలు తీసుకోవాలని ిసీఐ విజయకృష్ణను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T06:11:55+05:30 IST