గ్యార్మీ వేడుకలు స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2021-11-26T05:50:53+05:30 IST

కులమతాలకు అతీతంగా గ్యార్మీ వేడుకలు జరుపుకోవటం స్ఫూర్తిదాయకమని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు.

గ్యార్మీ వేడుకలు స్ఫూర్తిదాయకం
గ్యార్మీ వేడుకల్లో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా

గుంటూరు, నవంబరు 25: కులమతాలకు అతీతంగా గ్యార్మీ వేడుకలు జరుపుకోవటం స్ఫూర్తిదాయకమని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్‌లో వర్తకుల సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన గ్యార్మీ వేడుకలు హాజరైన ఆయన జెండాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు వీరిశెట్టి లక్ష్మీనారాయణ, సీహెచ్‌ నాగేశ్వరరావు, షేక్‌ బాసా, చిమటా శివకోటేశ్వరరావు, బోసు, శ్రీనివాసరావు, ఆయిశెట్టి శ్రీనివాస్‌ తదితరులున్నారు. 


Updated Date - 2021-11-26T05:50:53+05:30 IST