7కే వాక్‌ను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-02-06T06:13:38+05:30 IST
ఆరోగ్యంపై అవగాహనలో భాగంగా నగరపాలక సంస్థ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సౌజన్యంతో ఈ నెల 7న జరిగే 7కే వాక్‌ను విజయవంతం చేయాలని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు.

గుంటూరు, ఫిబ్రవరి 5: ఆరోగ్యంపై అవగాహనలో భాగంగా నగరపాలక సంస్థ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సౌజన్యంతో ఈ నెల 7న జరిగే 7కే వాక్‌ను విజయవంతం చేయాలని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు. బస్టాండ్‌రోడ్డులోని తన కార్యాలయంలో 7కే వాక్ పోస్టర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ స్టేడియం నుంచి ఉదయం 7 గంటలకు ఈ వాక్ ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో జీఎంసీ అధికారి శాంతిరాజు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు తోట ఆంజనేయులు, వాకా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.