చట్టాలను అపహాస్యం చేస్తోన్న పాలకులు

ABN , First Publish Date - 2021-02-06T05:12:26+05:30 IST

చట్టాలను, కోర్టులను పాలకులు అపహాస్యం చేస్తున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.

చట్టాలను అపహాస్యం చేస్తోన్న పాలకులు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనగాని

చెరుకుపల్లి, ఫిబ్రవరి 5:చట్టాలను, కోర్టులను పాలకులు అపహాస్యం చేస్తున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. చెరుకుపల్లిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 మాసాలు గడుస్తున్నా గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి తవ్వకాలలో అక్రమాలకు పాల్పడుతూ కోట్లు దండుకుంటున్నారన్నారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారన్నారు. ఎస్‌ఈసీ ఆదేశాలు ఉల్లంఘించి వలంటీర్లు అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థుల వెంట తిరుగుతూ బహిరంగంగా ప్రచారం చేస్తున్నారన్నారు. అంతేగాక ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తాయని భయపెడుతున్నారన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లాది రామకృష్ణ, ఎమ్మార్కే మూర్తి, కుమారస్వామి, దివి రాంబాబు, కందుల వెంకటేశ్వరరావు, కాటూరు నాగేశ్వరరావు, కలగంటి కుమార్‌, ఉప్పాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T05:12:26+05:30 IST