మొక్కలు పెంపకంతో పర్యావరణ పరిరక్షణ

ABN , First Publish Date - 2021-09-03T06:35:59+05:30 IST

పర్యావరణ పరిరక్షణకు, ఆక్సిజన పెంపొందించడానికి మొక్కల పెంపకమే సరైన మార్గమని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు.

మొక్కలు పెంపకంతో పర్యావరణ పరిరక్షణ
మొక్కలు నాటుతున్న మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

పచ్చ తోరణం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీరంగనాథరాజు

క్రోసూరు, సెప్టెంబరు 2: పర్యావరణ పరిరక్షణకు, ఆక్సిజన పెంపొందించడానికి మొక్కల పెంపకమే సరైన మార్గమని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. మండలంలోని పీసపాడులో గురువారం పచ్చతోరణం పథకం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటి స్థలాలు అందించటంతో పాటు పక్కా గృహాలు కూడా నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే 15 లక్షల గృహ నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్నారు. జిల్లాలో మూడు లక్షల మందికి నివేశన స్థలాలు, గృహాలు మంజూరు చేశామన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించే ఉద్దేశంతో కృష్ణా నది వద్ద ఎత్తి పోతల పథకాలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే శంకరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 1,00,357 మొక్కలను నాటుతున్నట్టు చెప్పారు. క్రోసూరు మండలం పీసపాడు నుంచి అచ్చంపేట మండలంలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న మాదిపాడు వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలను సంరక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో క్రోసూరు ఉప సర్పంచ షేక్‌ మస్తాన, నాయకులు కంచేటి సాయిబాబు, విప్పల వెంకట రామిరెడ్డి, షేక్‌ గఫూర్‌, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన డాక్టర్‌ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-09-03T06:35:59+05:30 IST