మెమో ఇచ్చారని అంగన్‌వాడీ టీచర్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-18T16:05:55+05:30 IST

అనారోగ్యంతో..

మెమో ఇచ్చారని అంగన్‌వాడీ టీచర్‌ ఆత్మహత్య

గుంటూరు: అనారోగ్యంతో విధులకు గైర్హాజరవుతున్నారనే కార ణంగాపై అధికారులు ఇచ్చిన గైర్హాజరు మెమోతో మానసిక వేదనకు గురైన వినుకొండ మండలం కొత్త జెడ్డావారిపాలెం అంగన్‌వాడీ టీచర్‌ కవలకుంట మేరికుమారి(40) ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి ఫిట్స్‌ వ్యాధి ఉంది. పలుమార్లు ఆమె విధులకు గైర్హాజరైంది. దీంతో అధికారులు ఆమెకు గైర్హాజరు మెమో జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె మానసికంగా ఇబ్బందిపడుతుంది. దీంతో పది రోజుల క్రితం  తన అక్క లోకేశ్వరి వద్దకు వచ్చింది.  సోమవారం ఉదయం ఆమె ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుంది. దీంతో ఆత్మహత్య విషయాన్ని పాస్టర్‌గా పని చేసే లింగారావుకు  కూతురు ఇచ్చింది. దీంతో ఆయన గుంటూరు వచ్చి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-05-18T16:05:55+05:30 IST