85 ఏళ్ల వృద్ధుడికి అత్యవసర బైపాస్‌ సర్జరీ

ABN , First Publish Date - 2021-01-14T05:06:29+05:30 IST

గుండెపోటుకు గురై అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన నాగేశ్వరరావు అనే 85 ఏళ్ల వృద్ధుడికి రమేష్‌ హాస్పిటల్స్‌లో విజయవంతంగా బైపాస్‌ ఆపరేషన్‌ నిర్వహించి ప్రాణాలు కాపాడారు.

85 ఏళ్ల వృద్ధుడికి అత్యవసర బైపాస్‌ సర్జరీ

గుంటూరు (మెడికల్‌) జనవరి 13: గుండెపోటుకు గురై అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన నాగేశ్వరరావు అనే 85 ఏళ్ల వృద్ధుడికి రమేష్‌ హాస్పిటల్స్‌లో విజయవంతంగా బైపాస్‌ ఆపరేషన్‌ నిర్వహించి ప్రాణాలు కాపాడారు. ఆయనకు గుండెలో మూడు ప్రధాన రక్తనాళాలు పూడుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. సీటీ సర్జన్లు శివప్రసాద్‌, నాగేశ్వరరావు, కార్డియాలజిస్టులు హరిత, రామారావు, సాయిప్రసాద్‌ తదితరులు విజయవంతంగా ఆపరేషన్‌ జరిపారు. ఆరోగ్యపరంగా కోలుకోవడంతో బుధవారం నాగేశ్వరరావును ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. వైద్యసేవలు అందిస్తున్న రమేష్‌ హాస్పిటల్స్‌ వైద్య బృందాన్ని మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.రమేష్‌బాబు అభినందించారు. 

Updated Date - 2021-01-14T05:06:29+05:30 IST