థలసీమియా పిల్లలకు మెరుగైన చికిత్స

ABN , First Publish Date - 2021-01-13T05:53:22+05:30 IST

థలసీమియా బాఽధిత పిల్లలకు ప్రభుత్వాస్పత్రి అండగా ఉంటుందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి తెలిపారు.

థలసీమియా పిల్లలకు మెరుగైన చికిత్స

గుంటూరు (మెడికల్‌) జనవరి 8: థలసీమియా బాఽధిత పిల్లలకు ప్రభుత్వాస్పత్రి అండగా ఉంటుందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి తెలిపారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆసుపత్రి పిల్లల వైద్య విభాగంలో మంగళవారం ఉచిత రక్తమార్పిడి శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ శిబిరంలో ఆరుగురు పిల్లలకు రక్తమార్పిడి చేశారు. కార్యక్రమంలో సీఎస్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ సతీష్‌కుమార్‌, పిల్లల వైద్యులు దేవకుమార్‌, అడ్మినిస్ట్రేటర్‌ ప్రవీణ్‌కుమార్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా కోశాధికారి రవి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:53:22+05:30 IST