బర్డ్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-01-12T05:41:47+05:30 IST

బర్డ్‌ ఫ్లూపై పెరటి కోళ్ల పెంపకం, పౌలీ్ట్ర ఫారాలున్న గ్రామాలను గుర్తించి రైతులకు అవగాహన కల్పిస్తామని పశుసంవర్థక శాఖ జిల్లా జేడీ డాక్టర్‌ ఆర్‌ చిన్నయ్య పేర్కొన్నారు.

బర్డ్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలి
కొత్తపేటలోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న అధికారులు

పశుసంవర్థక శాఖ జేడీ చిన్నయ్య

గుంటూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): బర్డ్‌ ఫ్లూపై పెరటి కోళ్ల పెంపకం, పౌలీ్ట్ర ఫారాలున్న గ్రామాలను గుర్తించి రైతులకు అవగాహన కల్పిస్తామని పశుసంవర్థక శాఖ జిల్లా జేడీ డాక్టర్‌ ఆర్‌ చిన్నయ్య పేర్కొన్నారు. సోమవారం కొత్తపేటలోని శాఖ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ జిల్లాలో నియంత్రణకు మండలాల వారీగా ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను ఏర్పాటు చేశామన్నారు. వలస పక్షలు, కాకులు ఆకస్మిక మరణాలకు గురైతే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.  సమావేశంలో వెటర్నరీ డాక్టర్లు స్వర్ణలత, లావణ్య, ఏడీ డాక్టర్‌ ఆర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-12T05:41:47+05:30 IST