పట్టణ ఆరోగ్య కేంద్ర భవనానికి శంకుస్థాపన
ABN , First Publish Date - 2021-07-08T06:22:42+05:30 IST
నగర ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు.

గుంటూరు(కార్పొరేషన్), జూలై 7: నగర ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. బుధవారం ఆయన స్థానిక ప్రగతి నగర్ వద్ద డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో 16 నూతన డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చేపట్టనున్నామన్నారు. నగర ప్రజలకు స్థానికంగానే చికిత్స అందించుటకే బెడ్స్, ఆక్సిజన్, లాబ్‌లు, ఆపరేషన్ థియేటర్‌లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే 13 పట్టణ ఆరోగ్య కేంద్రాలకు ఒక్కోదానికి మరమ్మతులకు రూ.10 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ప్రజల వైద్య అవసరాలు తీర్చుటకు ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పోలవరపు జ్యోతి, ఇర్రి ధనలక్ష్మి, షేక్ మీరావలి, మహమ్మద్ అబీద్ భాషా, వైసీపీ నాయకులు రాచమంటి భాస్కర్, జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.