పూర్వవిద్యార్థుల చేయూత అభినందనీయం

ABN , First Publish Date - 2021-08-20T05:34:02+05:30 IST

పాఠశాలకు పూర్వ విద్యార్థులు చేయూత ఇవ్వడం అభినందనీయమని మేయర్‌ కావటి మనోహరనాయుడు తెలిపారు.

పూర్వవిద్యార్థుల చేయూత అభినందనీయం
ల్యాప్‌టాపుల్ని అందజేస్తున్న మేయర్‌ పక్కన పూర్వ విద్యార్థులు

గుంటూరు(విద్య), ఆగస్టు 19: పాఠశాలకు పూర్వ విద్యార్థులు చేయూత ఇవ్వడం అభినందనీయమని మేయర్‌ కావటి మనోహరనాయుడు తెలిపారు.   అరండల్‌పేటలోని ఎస్‌కేవీఆర్‌ నాయుడు స్కూల్‌ ఉన్నత పాఠశాలకు గురువారం 1994-95 విద్యాసంవత్సరం పూర్వ విద్యార్థులు ల్యాపుటాప్‌లను అందించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు జగదీష్‌కుమార్‌, పూర్వ విద్యార్థుల సంఘ నాయకుడు గాజుల నరసింహారావు, శ్రీహరి, సయ్యద్‌బాష, శేషుకుమారి, హెచఎం జిడుగు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు  

గుంటూరు(కార్పొరేషన): విద్యా రంగంలో  సీఎం జగన విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారని నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు తెలిపారు. స్థానిక నల్లచెరువులోని మున్సిపల్‌ స్కూలులో గురువారం విద్యాకానుకను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు సరైన పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, బ్యాగ్‌ వంటివి నాసిరకంగా ఉండేవన్నారు. ప్రస్తుతం అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద వంటి పథకాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు మంచి బలమైన,నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారన్నారు. సీఎం చిత్రపటానికి విద్యార్థులు, పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వార్డు ప్రసిడెంట్లు ఖాజా మొహిద్దీన, కంతేటి శ్యాం, స్థానిక నాయకులు బాబు, యర్రబోతుల శివారెడ్డి, షేక్‌, ఇబ్రహీం, షేక్‌ ఫాతిమా, ఎద్దు సీతామహాలక్ష్మి, బాలశౌరి, హెచఎం ఎం. రాజు, కొరివి విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఆకలితో ఎవరూ ఉండకూడదనే ఫుడ్‌ బ్యాంక్‌లు

నగరంలో ఆకలితో ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతోనే వైఎస్‌ఆర్‌ ఫుడ్‌ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగిందని నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు తెలిపారు. గాంధీపార్క్‌ వద్ద గల ఫుడ్‌ బ్యాంక్‌ను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరానికి వివిధ పనుల నిమిత్తం వేరే ప్రాంతాల నుంచి వచ్చే పేదలకు ఫుడ్‌ బ్యాంకులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నగరంలో జరిగే ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని సేకరించి అవసరమైన వారికి అందించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్‌ ఫుడ్‌ బ్యాంకులు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ధూపాటి వంశీబాబు, షేక్‌ రోషన, అచ్చాల వెంకటరెడ్డి, యాట్ల రవికుమార్‌, అమ్మ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-20T05:34:02+05:30 IST