వ్యాక్సిన్‌తో కరోనా నుంచిరక్షణ

ABN , First Publish Date - 2021-06-21T06:25:10+05:30 IST

కరోనా నుంచి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్‌ వేయించుకోవడం ఒక్కటే మార్గమని నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు అన్నారు.

వ్యాక్సిన్‌తో కరోనా నుంచిరక్షణ
అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ను ప్రారంభిస్తున్న మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు

మేయర్‌ కావటి  మనోహర్‌ నాయుడు

గుంటూరు(కార్పొరేషన్‌), జూన్‌ 20: కరోనా నుంచి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్‌ వేయించుకోవడం ఒక్కటే మార్గమని నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు అన్నారు. ఆదివారం నల్లపాడులో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లను ఆధునికీకరించడమే కాక, నూతనంగా 17 వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లను నిర్మించేందుకు శంకుస్థాపన చేశామన్నారు. కార్యక్రమంలో  వెంకటరమణ దేవి శ్యామల, చల్లా రాజ్యలక్ష్మి, పడాల సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు శ్యామల బ్రహ్మారెడ్డి, చల్లా సాంబిరెడ్డి, బి.బాల అంజిరెడ్డి, సీహెచ్‌ వీరభాస్కర్‌రెడ్డి, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-06-21T06:25:10+05:30 IST