23న వర్చువల్‌ లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2021-01-21T05:21:21+05:30 IST

జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23న శనివారం వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుమ్మడి గోపీచంద్‌ తెలిపారు.

23న వర్చువల్‌ లోక్‌ అదాలత్‌

గుంటూరు లీగల్‌, జనవరి 20: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23న శనివారం వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుమ్మడి గోపీచంద్‌ తెలిపారు. జిల్లావ్యాప్తంగా వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న రాజీపడదగ్గ క్రిమినల్‌, సివిల్‌ కేసులు, చెక్‌బౌన్స్‌ కేసులు, మోటారు వాహన ప్రమాదాల నష్ట పరిహరం కేసులు, కార్మిక వివాదాలకేసులతో పాటు లోక్‌ అదాలత్‌లోనే దాఖలైన ప్రిలిటిగేషన్‌ కేసులను ఈ లోక్‌అదాలత్‌ ద్వారా పరిష్కరిస్తామన్నారు. రాజీకోసం కక్షిదారులు కోర్టుకు హాజరు కావాల్సిన పనిలేదని, వర్చువల్‌ విధానంలో న్యాయమూర్తుల ఎదుట హాజరై కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. వాట్సాప్‌, బ్లుజోన్స్‌ యాప్‌ల ద్వారా వీడియో కాల్‌లో రాజీమార్గంలో కేసుల పరిష్కారం జరుగుతుందని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


జిల్లా జైలు పరిశీలన


జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.రత్నకుమార్‌ బుధరవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా జైలును పరిశీలించారు వర్చువల్‌ విధానం ద్వారా ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులు, జైలులో అందిస్తున్న సౌకర్యాలు, ఆహారం, పరిశుభ్రత పరమైన అంశాల గురించి వాకబు చేశారు.

Updated Date - 2021-01-21T05:21:21+05:30 IST