జూలై 1 నుంచి ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ పరీక్షలు

ABN , First Publish Date - 2021-06-21T13:01:32+05:30 IST

కొవిడ్ కారణంగా మే, జూన్ మాసాలలో..

జూలై 1 నుంచి ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ పరీక్షలు

గుంటూరు: కొవిడ్ కారణంగా మే, జూన్ మాసాలలో నిలిచిపోయిన ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ పరీక్షలను తిరిగి జూలై 1 నుంచి నిర్వహిస్తున్నట్లు డీటీసీ ఈ,మీరాప్రాసద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మే, జూన్ మాసాలల్లో స్లాట్స్ బుక్ చేసుకున్నవారు ఏపీ ఆర్టీఏసిటిజన్.ఈ ప్రగతి.ఓఆర్జీ అనే పోర్టల్ ద్వారా గానీ, ఆయా రవాణా శాఖ కార్యాలయాల్లో గానీ జూలై నెలకు మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాక్‌లాగ్ పరీక్షలు పూర్తి అయిన తరువాతే కొత్త అభ్యర్థులు తమ ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ పరీక్షలకు స్లాట్స్ బుక్ చేసుకోవాలని తెలిపారు.

Updated Date - 2021-06-21T13:01:32+05:30 IST