రుణ ప్రణాళిక లక్ష్యం.. రూ.31,500 కోట్లు

ABN , First Publish Date - 2021-09-02T05:51:51+05:30 IST

ఈ ఆర్థిక సంవత్సరం జిల్లా రుణప్రణాళిక లక్ష్యం రూ.31,500 కోట్లుగా పెట్టుకున్నట్లు లీడ్‌బ్యాంకు మేనేజర్‌ ఈదర రాంబాబు తెలిపారు.

రుణ ప్రణాళిక లక్ష్యం.. రూ.31,500 కోట్లు

లీడ్‌బ్యాంకు మేనేజర్‌ ఈదర రాంబాబు

సత్తెనపల్లి రూరల్‌, సెప్టెంబరు 1: ఈ ఆర్థిక సంవత్సరం జిల్లా  రుణప్రణాళిక లక్ష్యం రూ.31,500 కోట్లుగా పెట్టుకున్నట్లు లీడ్‌బ్యాంకు మేనేజర్‌ ఈదర రాంబాబు తెలిపారు. స్థానిక మండల పరిషత కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రుణప్రణాళికలో రూ.19,300 కోట్లు వ్యవసాయ రంగానికి, రూ.1500కోట్లు  పంట రుణాలు ఇచ్చేందుకు కేటాయించామన్నారు. ఖరీఫ్‌లో రూ.9 వేల కోట్లు, రబీలో రూ.600 కోట్లు రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల 4 నుంచి 7 వరకు డ్వాక్రా మహిళలకు రుణమేళ నిర్వహిస్తామన్నారు. పశువుల పెంపకందారులు, మత్స్యకారులు సుమారు 17 వేల మందికి కిసాన క్రెడిట్‌కార్డులు ఇచ్చినట్లు చెప్పారు. 


Updated Date - 2021-09-02T05:51:51+05:30 IST