సత్తా చాటిన కుంగ్‌ఫూ అకాడమీ విద్యార్థులు

ABN , First Publish Date - 2021-09-01T17:23:51+05:30 IST

రాజమండ్రి శ్రీకృష్ణసాయి కల్యాణమండపంలో..

సత్తా చాటిన కుంగ్‌ఫూ అకాడమీ విద్యార్థులు

చిలకలూరిపేట టౌన్‌: రాజమండ్రి శ్రీకృష్ణసాయి కల్యాణమండపంలో ఎస్‌ఎం కుంగ్‌ఫూ ఆధ్వర్యంలో జరిగిన తొలి అంతరజిల్లాల కుంగ్‌ఫూ అండ్‌ కరాటే పోటీలలో చిలకలూరిపేట పట్టణంలోని సీఆర్‌ క్లబ్‌లో నిర్వహిస్తున్న న్యూషావోలిన్‌ కుంగ్‌ఫూ అకాడమీ పోలిరెడ్డిపాలెం, కళామందిర్‌ సెంటర్‌ బ్రాంచి విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. అకాడమీ నుంచి మొత్తం 20 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొనగా 10మంది విద్యార్థులు వివిధ కేటగిరీలలో బంగారు, రజత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సీఆర్‌ క్లబ్‌ ఆవరణలో మంగళవారం విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాస్టర్‌ బత్తుల విక్రమ్‌, మాస్టర్‌ షేక్‌ దరియవాలి, పి.నాగరాజు, యడ్ల సురేష్‌, కె.రాంబాబు, ఇన్‌స్ట్రక్టర్‌లు ఎస్‌కె రబ్బాని, ఎం.దుర్గాప్రసాద్‌, ఎం .రాజ్యలక్ష్మి, ఒ వెంకటకల్యాణ్‌, ఎస్‌కె అన్వర్‌, కె రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-01T17:23:51+05:30 IST