దళితులను అణచివేస్తున్న వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-08-11T05:17:44+05:30 IST

దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన నేడు వారినే అణగతొక్కాలని చూస్తున్నారని టీడీపీ పశ్చిమ ఇనఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర ఆరోపించారు.

దళితులను అణచివేస్తున్న వైసీపీ ప్రభుత్వం
దళితులను అణచి వేస్తున్నారంటూ ఆందోళన నిర్వహిస్తున్న టీడీపీ నేతలు నాని, మ్యానీ తదితరులు

పశ్చిమ టీడీపీ ఇనఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర

గుంటూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన నేడు వారినే అణగతొక్కాలని చూస్తున్నారని టీడీపీ పశ్చిమ ఇనఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర ఆరోపించారు. దళితుల హక్కులు కాలరాస్తున్నారంటూ లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద పార్టీ రాష్ట్ర క్రిస్టియన సెల్‌ అధ్యక్షుడు మద్దిరాల జోసఫ్‌ ఇమ్మానియల్‌, టీడీపీ కార్పొరేటర్లు తొమ్మిదిమందితో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో దళితుల అభివృద్ధి, సంక్షేమానికి ఎన్ని నిధులు ఖర్చుపెట్టారో, జగన వచ్చాక ఎన్ని నిధులు వెచ్చించారో చెప్పాలని వైసీపీ నేతలకు సవాలు విసిరారు. టీడీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం ప్రభుత్వ పరికిపంద చర్య అని రవీంద్ర అన్నారు. కాగా వైసీపీ పాలనలో దళితులకు, క్రిస్టియనలకు రక్షణ లేకుండా పోయిందని మద్దిరాల జోసఫ్‌ ఇమ్మానియల్‌ అన్నారు. దళితుల పట్ల సీఎం జగనరెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు  కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరాం ప్రసాద్‌, కొమ్మినేని కోటేశ్వరరావు, ఎల్లావుల అశోక్‌ యాదవ్‌, ఈరంట్ల వరప్రసాద్‌(బాబు), మానం పద్మశ్రీ, తేలుకుంట్ల హనమాయమ్మ, నేతలు రాజీవ్‌ ఆనంద్‌, కనపర్తి శ్రీనివాసరావు, కసుకుర్తి హనుమంతరావు, రావిపాటి సాయి, పొపూరి నరేంద్ర, బాజీ, విజయలక్ష్మి, ఇతర నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-11T05:17:44+05:30 IST