టీడీపీ పాలనలోనే నగరాభివృద్ధి

ABN , First Publish Date - 2021-02-26T05:41:37+05:30 IST

టీడీపీ పాలనలో గుంటూరు నగరం అభివృద్ధి చెందిందని పశ్చిమ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర తెలిపారు.

టీడీపీ పాలనలోనే నగరాభివృద్ధి
ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, శ్రావణ్‌కుమార్‌, రత్తయ్య తదితరులు

గుంటూరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): టీడీపీ పాలనలో  గుంటూరు నగరం అభివృద్ధి చెందిందని పశ్చిమ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర తెలిపారు. గురువారం ఆయన టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య 16వ డివిజన్‌ అభ్యర్థి ఉగ్గిరాల వరలక్ష్మికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక నగరం అభివృద్ధికి దూరమైందన్నారు.  కనీసం రోడ్లపైన గుంతలు కూడా పూడ్చలేని స్థితిలో ఉందని తెలిపారు. రూరల్‌ మండలం పరిస్థితి అధ్వానంగా ఉందని తెలిపారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తున్నారన్నారు. రెండేళ్ల పాలనలో చేసింది ఏమీ లేకపోయినా పన్నుల మోతతో ప్రజల నడ్డివిరుస్తోందన్నారు. ఆస్తి పన్ను 5 నుంచి 10 రెట్లు దాకా పెంచేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే పన్నుల మోత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మేయర్‌గా తనకు అవకాశం ఇస్తే నగరం రూపురేఖలు మారుస్తానని రవీంద్ర తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మానుకొండ శివప్రసాద్‌, మద్దినేని వీరాంజనేయులు, మార్కండేయులు, ప్రతాప్‌, అమర్నాథ్‌, సోమవరపు చలమయ్య, వెంకటస్వామి, శివ నాగరాజు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. 

సమష్టి కృషితో పట్టు సాధించాలి 

నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడించాలని ఆ పార్టీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 18, 19, 20, 21 డివిజన్ల సమీక్షలో ప్రసంగించారు.   వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని.. సంక్షేమ కార్యక్రమాలను నిర్వీర్యం చేసిన ఘనత సీఎం జగన్‌రెడ్డిదేనన్నారు. అప్పులు తప్ప కొత్త ప్రాజెక్టు ఒక్కటి కూడా తీసుకురాకుండా ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. పశ్చిమ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ నవరత్నాల పేరిట ప్రజలను జగన్‌ మోసం చేశారని విమర్శించారు. ఇళ్ల స్థలాల పేరుతో ప్రజలను ప్రలోభపెడుతూ ఎన్నికల్లో వైసీపీ లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో మానుకొండ శివప్రసాద్‌, కనపర్తి శ్రీనివాసరావు, మల్లె విజయ, గుంటుపల్లి మధుసూదనరావు, అడపాబాబు, షేక్‌ రఫీ, సాంబ, వై హనుమయ్య, ఆదంసా తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-26T05:41:37+05:30 IST