నిస్వార్థసేవకు ప్రతిరూపం.. రెడ్‌క్రాస్‌

ABN , First Publish Date - 2021-08-27T05:44:38+05:30 IST

మానవత్వపు విలువలతో ప్రపంచవ్యాప్తంగా విశేషసేవలందిస్తున్న నిస్వార్థసేవా సంస్థ రెడ్‌క్రాస్‌ అని ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ చైర్మన, ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

నిస్వార్థసేవకు ప్రతిరూపం.. రెడ్‌క్రాస్‌
ఆర్టీసీ హాస్పిటల్‌కు ఆక్సిజన కాన్సనట్రేటర్‌లను అందజేస్తున్న ఆర్టీసీ ఎమ్‌డీ ద్వారకా తిరుమలరావు

ఆర్టీసీ ఎమ్‌డీ ద్వారకా తిరుమలరావు

గుంటూరు(తూర్పు), ఆగస్టు 26: మానవత్వపు విలువలతో ప్రపంచవ్యాప్తంగా విశేషసేవలందిస్తున్న   నిస్వార్థసేవా సంస్థ రెడ్‌క్రాస్‌ అని ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ చైర్మన, ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. విజయవాడలోని ఏపీఎస్‌ సెంట్రల్‌ హస్పిటల్‌కు  రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ  అందజేసిన ఆక్సిజన కాన్సనట్రేటర్లను గురువారం ఆయన స్థానిక జడ్పీ ఆవరణలోని రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో రెడ్‌క్రాస్‌ అందించిన సేవలు అభినందనీయం అని కొనియాడారు. రెడ్‌క్రాస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎటువంటి విపత్తులు వచ్చినా సమాజహిత కార్యక్రమాలు నిర్వహించడంలో రెడ్‌క్రాస్‌ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కన్వీనర్‌ రామచంద్రరాజు, జిల్లా చైర్మన వడ్లమాని రవి తదితరులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-08-27T05:44:38+05:30 IST