కిడాంబి శ్రీకాంత్‌కు సత్కారం

ABN , First Publish Date - 2021-12-31T05:53:57+05:30 IST

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషుల విభాగంలో ఇటీవల రజిత పతక విజేత గుంటూరుకి చెందిన షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ను గురువారం సత్కరించారు.

కిడాంబి శ్రీకాంత్‌కు సత్కారం
శ్రీకాంత్‌, ఆయన తల్లిదండ్రులను సత్కరిస్తున్న డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, రాయపాటి గోపాలకృష్ణ

గుంటూరు(విద్య), డిసెంబరు 30: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషుల విభాగంలో ఇటీవల రజిత పతక విజేత గుంటూరుకి చెందిన షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ను గురువారం సత్కరించారు. ఏపీ, గుంటూరు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌, నాగార్జున ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో చౌడవరంలోని ఆర్వీఆర్‌జేసీలో ఈ కార్యక్రమం జరిగింది. భారత బ్మాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కేసీహెచ్‌ పున్నయ్యచౌదరి, ఏపీ, గుంటూరు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యదర్శులు డాక్టర్‌ అంకమ్మచౌదరి, దామచర్ల శ్రీనివాసరావు, ఆర్వీఆర్‌జేసీ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, రాయపాటి గోపాలకృష్ణ, ట్రెజరర్‌ డాక్టర్‌ కొండబోలు కృష్ణప్రసాద్‌, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కొమ్మినేని రవీంద్ర  తదితరులు పాల్గొని శ్రీకాంత్‌, ఆయన తల్లిదండ్రులు రాధ, కృష్ణలను సత్కరించారు.  

యువతరానికి శ్రీకాంత్‌ ఆదర్శం

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటి సరికొత్త రికార్డు నెలకొల్పిన స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ యువతకు ఆదర్శంగా నిలిచారని ఎంపీ గల్లా జయదేవ్‌ తెలిపారు.   గురువారం శ్రీకాంత్‌ను గుంటూరులోని  నివాసంలో కలిసిన గల్లా ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహ్మద్‌ నసీర్‌, చిట్టాబత్తిన చిట్టిబాబు, దామచర్ల శ్రీనివాసరావు, రావిపాటి సాయి, మురళీ, సౌపాటి రత్నం, సాంబశివరావు, రాష్ట్ర బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ట్రెజర్‌ సంపత్‌ తదితరలు పాల్గొన్నారు. 

బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో.. 

షట్లర్‌ శ్రీకాంత్‌ను గురువారం బ్రాహ్మణ సేవాసమితి సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు రంగావజ్జుల లక్ష్మీపతి, కార్యదర్శి కొప్పర్తి సీతారమేష్‌, కోశాధికారి మాచిరాజు శ్రీధర్‌, కర్లపాలెం బాలకృష్ణ, తుళ్ళూరు ప్రకాష్‌, పెద్దిరాజు కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 
Updated Date - 2021-12-31T05:53:57+05:30 IST