ఎమ్మెల్యే అంబటికి మతిభ్రమించింది

ABN , First Publish Date - 2021-02-01T06:13:54+05:30 IST

పదే పదే కరోనా సోకడంతో ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మతి భ్రమించిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు.

ఎమ్మెల్యే అంబటికి మతిభ్రమించింది

  టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి


నరసరావుపేట, జనవరి 31: పదే పదే కరోనా సోకడంతో ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మతి భ్రమించిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. ఆదివారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను సంకర జాతికి చెందిన వ్వక్తి అని అంబటి దూషించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. నోరు ఆదుపులో లేకపోవడం వలనే రెండోసారి ఎమ్మెల్యే కావడానికి 30 ఏళ్ళు పట్టిందన్నారు. మండలి చైర్మన్‌ షరీఫ్‌, నాయాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులను బెదిరిస్తూ వారిని బ్లాక్‌ మెయిల్‌ చేసే చరిత్ర మీదికాదా అని ప్రశ్నించారు. 16 నెలలు జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న జగన్‌రెడ్డిని నిజమైన గాంధేయవాది అని వైసీపీ నేతలు పొగడటం సిగ్గుచేటన్నారు. న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదన్న విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పుతోనైనా వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని శ్రీనివాసరావు హితవు పలికారు. 

Updated Date - 2021-02-01T06:13:54+05:30 IST