బ్లాక్‌ మెయిల్‌ వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య

ABN , First Publish Date - 2021-01-14T05:05:47+05:30 IST

బ్లాక్‌మెయిల్‌ సంస్కృతి వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు.

బ్లాక్‌ మెయిల్‌ వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య

 కనపర్తి శ్రీనివాసరావు


గుంటూరు, జనవరి 13(ఆంధ్రజ్యోతి): బ్లాక్‌మెయిల్‌ సంస్కృతి వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం ఆయన పశ్చిమ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. గతంలో సీఎం జగన్‌రెడ్డి అక్రమాస్తుల కేసును విచారిస్తున్న అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను కూడా మానసికంగా హింసించారని ఆరోపించారు. తమ మాట వినని ఆచార్య ఎస్జీ రంగా విశ్వవిద్యాలయం ఉప కులపతిపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుపెట్టి ఆయనను అరెస్టు చేసి భయపెట్టిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మాయలో పడి దిగజారి ప్రవర్తిస్తున్నారని తోటి ఉద్యోగులే ఆవేదన చెందుతున్నారని తెలిపారు.  

Updated Date - 2021-01-14T05:05:47+05:30 IST