వైసీపీ చాతగానితనంతో ఎడారి కానున్న ఏపీ

ABN , First Publish Date - 2021-07-08T05:45:38+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో, సీఎం జగన క్విడ్‌ప్రోకోకి పాల్పడటంతో ఏపీ ఎడారిగా మారనుందని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు.

వైసీపీ చాతగానితనంతో ఎడారి కానున్న ఏపీ

కనపర్తి శ్రీనివాసరావు

గుంటూరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో, సీఎం జగన క్విడ్‌ప్రోకోకి పాల్పడటంతో ఏపీ ఎడారిగా మారనుందని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. పార్టీ పశ్చిమ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో జగనకు కేసీఆర్‌ అన్ని విధాలుగా సహాయపడటంతో నేడు అక్రమ ప్రాజెక్టులపై జగన నోరు మెదపటానికి భయపడుతున్నారన్నారు. పరిశ్రమలు తేవడం, ప్రాజెక్టులు కట్టడం చేతగాని వైసీపీ ప్రభుత్వం పదే పదే చంద్రబాబుపై ఆరోపణలు చేయటం తగదన్నారు. కృష్ణానదీ జలాల్లో 50శాతం వాటా కావాలని కేసీఆర్‌ చేస్తున్న వితండవాదనపై మాట్లాడేందుకు సజ్జల ఎందుకు భయడుతున్నారని ప్రశ్నించారు. నాడు కృష్ణా మిగులు జలాలపై హక్కు కోరబోమని వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాతపూర్వకంగా ఇచ్చిన లేఖ నేడు ఏపీ రైతుల మెడకు ఉరితాడులా చుట్టకోనుందని విమర్శించారు. అదే రాజశేఖరరెడ్డిని తెలంగాణ మంత్రులు దారుణంగా అవమానిస్తుంటే చీటికీ మాటికి చంద్రబాబును విమర్శించే వైసీపీ బ్యాచ ఎక్కడ దాక్కున్నారని కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. 


Updated Date - 2021-07-08T05:45:38+05:30 IST