నిజమైన ఏకగ్రీవాలైతే ఆత్మహత్యలు ఎందుకు జరిగాయి?

ABN , First Publish Date - 2021-02-07T05:20:08+05:30 IST

బలవంతపు ఏకగ్రీవాలను నిలుపుకొనేందుకే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలెక్టర్లను సైతం బెదరించేస్థాయికి దిగజారిపోయారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు.

నిజమైన ఏకగ్రీవాలైతే ఆత్మహత్యలు ఎందుకు జరిగాయి?

కనపర్తి శ్రీనివాసరావు 

గుంటూరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): బలవంతపు ఏకగ్రీవాలను నిలుపుకొనేందుకే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలెక్టర్లను సైతం బెదరించేస్థాయికి దిగజారిపోయారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. నిజమైన ఏకగ్రీవాలయితే పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో మంత్రి సమాధానం చెప్పాలన్నారు. ఏస్‌ఈసీ పదవీకాలం మూడునెలలు అయితే వైసీపీ ప్రభుత్వం పాలన మూడేళ్లు మాత్రమేనని, జమిలి ఎన్నికలోస్తే అదికూడా లేదని తెలిపారు. ఎస్‌ఈసీ యాప్‌ను న్యాయస్థానం నిలుపుదల చేసినందుకే నిమ్మగడ్డను రాజీనామా చేయాలని కోరుతున్న మంత్రులు ఎన్నికలను ఆపటానికి భగీరథ ప్రయత్నం చేసి అన్నీ కోర్టుల్లో చివాట్లు తిన్న మీరెన్నిసార్లు రాజీనామా చేయాలో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు దగ్గర పనిచేసి ఐఏఏస్‌, ఐపీఎస్‌ అధికారులు, మంత్రులెవరూ అవినీతి కేసుల్లో జైలుపాలవలేదన్న విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి గుర్తించాలన్నారు. పాలానాపరంగా ఎస్‌ఈసీని ఎదుర్కొనలేక ఆయన కులంపై విషం చిమ్మేస్థాయికి మంత్రి దిగజారిపోవడం విమర్శించారు. సమావేశంలో ఎస్సీసెల్‌ నేత యరమాల విజయకిరణ్‌, తెలుగు యువత నగర అధ్యక్షుడు యల్లావుల అశోక్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-07T05:20:08+05:30 IST