జాతీయ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు మహిత ఎంపిక

ABN , First Publish Date - 2021-03-22T05:34:00+05:30 IST

జాతీయ జూనియర్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు కావూరు వినయాశ్రమానికి చెందిన అకల్క మహిత ఎంపికైట్లు కోచింగ్‌ క్యాంప్‌ నిర్వాహకులు ఆదివారం తెలిపారు.

జాతీయ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు మహిత ఎంపిక
అక్కల మహిత

పొన్నూరుటౌన్‌, మార్చి 21: జాతీయ జూనియర్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు కావూరు వినయాశ్రమానికి చెందిన అకల్క మహిత ఎంపికైట్లు కోచింగ్‌ క్యాంప్‌ నిర్వాహకులు ఆదివారం తెలిపారు. కర్నూలు జిల్లా డోన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా జట్టుకు ఎంపికైన మహిత ప్రతిభ చూపి రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించింది. ఈ నెల 22 నుంచి 25 వరకు తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో జరగనున్న జాతీయ జూనియర్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌ ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు ప్రాతినిధ్య వహించనుంది. ఆమె ఎంపికపై క్యాంప్‌ నిర్వాహకులు జక్క శ్రీనివాస్‌, కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి వీర్లంకయ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-03-22T05:34:00+05:30 IST