స్వచ్ఛ సంకల్పంపై దృష్టిపెట్టాలి

ABN , First Publish Date - 2021-12-19T05:43:51+05:30 IST

జగనన్న స్వచ్ఛ సంకల్పంపై గ్రామాలలో సర్పంచ్‌లు దృష్టి పెట్టాలని స్థానికసంస్థల జేసీ రాజకుమారి తెలిపారు.

స్వచ్ఛ సంకల్పంపై దృష్టిపెట్టాలి
ప్రతిజ్ఞ చేస్తున్న జేసీ రాజకుమారి, సీఈవో శ్రీనివాసరెడ్డి తదితరులు

సర్పంచ్‌లకు జేసీ రాజకుమారి సూచన

గుంటూరు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జగనన్న స్వచ్ఛ సంకల్పంపై గ్రామాలలో సర్పంచ్‌లు దృష్టి పెట్టాలని స్థానికసంస్థల జేసీ రాజకుమారి తెలిపారు. స్వచ్ఛ సంకల్పంపై మేజర్‌ గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులతో జడ్పీ సమావేశం మందిరంలో శనివారం జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. పారిశుధ్యం మెరుగుపడితేనే గ్రామాలు ఆరోగ్యవంతంగా ఉంటాయన్నారు. తడి, పొడిచెత్త సేకరణ, ఘన వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారి తదితర అంశాలపై క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. జడ్పీ సీఈవో డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డీపీవో కేశవరెడ్డి మాట్లాడుతూ  గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. సమావేశంలో స్వచ్ఛ సంకల్పం జిల్లా కోఆర్డినేటర్‌ పద్మాకర్‌ తదితరులు ప్రసంగించారు.  


Updated Date - 2021-12-19T05:43:51+05:30 IST