క్షయ వ్యాధి నిర్మూలనే ధ్యేయం
ABN , First Publish Date - 2021-03-25T05:17:32+05:30 IST
దేశంలో 2030 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆశయానికి అనుగుణంగా ఆరోగ్య సిబ్బంది పనిచేసి క్షయరహిత భారత్ నిర్మాణానికి కృషిచేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి, సచివాలయాలు) పి. ప్రశాంతి పిలుపునిచ్చారు.

జాయింట్ కలెక్టర్ ప్రశాంతి
గుంటూరు (మెడికల్), మార్చి 24: దేశంలో 2030 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆశయానికి అనుగుణంగా ఆరోగ్య సిబ్బంది పనిచేసి క్షయరహిత భారత్ నిర్మాణానికి కృషిచేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి, సచివాలయాలు) పి. ప్రశాంతి పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినం సందర్భంగా బుధవారం గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి శుశృతహాల్‌లో క్షయపై అవగాహన సదస్సు నిర్వహించారు. తొలుత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద టీబీపై ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జేసీ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో కళాజాత బృందాల ప్రదర్శనతో పాటు పెద్ద సంఖ్యలో నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం ఆసుపత్రిలో జరిగిన సదస్సులో జేసీ ప్రశాంతి ప్రసంగిస్తూ ఈ ఏడాది నుంచి క్షయ నిర్మూలనే ధ్యేయంగా అందరూ పనిచేయాలన్నారు. క్షయ లక్షణాలు ఉన్న వారిని త్వరగా గుర్తించి తగిన చికిత్సలు ఇప్పించడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని జేసీ ప్రశాంతి కోరారు.
ఐదు గ్రామాల్లో టీబీ సర్వే ప్రోగ్రాం
జిల్లా క్షయ నియంత్రాణాఽధికారి డాక్టర్ టి.రమేష్ మాట్లాడుతూ జిల్లాలో ఐదు గ్రామాల్లో క్షయ వ్యాఽధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సర్వేలో ఇప్పటి వరకు ఆరుగురు టీబీ రోగులను గుర్తించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జె.యాస్మిన్, అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ జయసింహ, లెప్రసీ, ఎయిడ్స్ అధికారి డాక్టర్ బీ సుబ్బారావు, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.నాగేశ్వరమ్మ, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.రఘు, ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ తదితరులు ప్రసంగించారు. ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి, వ్యాస రచన పోటీల్లో ప్రతిభ చూపిన నర్సింగ్ విద్యార్థినులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న క్షయ రోగులకు వరల్డ్ విజన్ సంస్థ పోషకాహార కిట్లను అందజేసింది.