అవగాహన లేమితో టీకాపై భయం
ABN , First Publish Date - 2021-02-07T05:21:46+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్‌పై అవగాహన లేమితోనే కొందరు టీకా వేయించుకునేందుకు భయపడుతున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్(సచివాలయాలు) పి.ప్రశాంతి పేర్కొన్నారు.

జేసీ(సచివాలయాలు) పి.ప్రశాంతి
యడ్లపాడు, ఫిబ్రవరి 6: కొవిడ్ వ్యాక్సిన్‌పై అవగాహన లేమితోనే కొందరు టీకా వేయించుకునేందుకు భయపడుతున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్(సచివాలయాలు) పి.ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం యడ్లపాడు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆమె రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 17వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు. తొలిదశలో హెల్త్‌కేర్ సిబ్బందికి 70శాతం మందికి, ఐసీడీఎస్ సిబ్బంది 52 శాతం వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీర్ఘకాలిక జబ్బులు, అలర్జీలతో బాధపడతున్నవారు వ్యాక్సిన్ తీసుకోవడం వలన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం సహజమన్నారు. బలవంతంగా ఎవరికీ వ్యాక్సిన్ వేయడం జరగదన్నారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మానాయక్, ఎంపీడీవో పి.మాధురి, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, హెల్త్ సూపర్‌వైజర్లు, ఆరోగ్యకార్యకర్తలు పాల్గొన్నారు.