బాణాసంచా వ్యాపారులు నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-10-21T05:40:13+05:30 IST

జిల్లాలో దీపావళి బాణాసంచా విక్రయాలు జరిగే ప్రాంతాలలో అగ్నిమాపక చర్యలు కచ్చితంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు.

బాణాసంచా వ్యాపారులు నిబంధనలు పాటించాలి
కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న జేసీ(రెవెన్యూ) దినేష్‌కుమార్‌

జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

గుంటూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దీపావళి బాణాసంచా విక్రయాలు జరిగే ప్రాంతాలలో అగ్నిమాపక చర్యలు కచ్చితంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో దీపావళి బాణాసంచా విక్రయ దుకాణాల ఏర్పాటుకు అనుమతుల మంజూరుపై రెవెన్యూ, మునిసిపల్‌, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు, దుకాణాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జీఎస్‌టీ రిజిసే్ట్రషన్లు ఉన్న వారికి మాత్రమే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఆర్‌డీవో కార్యాలయాల్లో వ్యాపారస్థులు దరఖాస్తులను ఎన్‌వోసీలు జత చేసి నివేదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో కొండయ్య, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శ్రీనివాసులురెడ్డి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీన, అర్బన్‌ జిల్లా అదనపు ఎస్‌పీ గంగాధర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-21T05:40:13+05:30 IST