భవన నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలి

ABN , First Publish Date - 2021-03-25T05:12:09+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ భవననిర్మాణాలకు స్థలాలను గుర్తించాలని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ, రైతుభరోసా) ఏఎస్‌ దినేష్‌కు మార్‌ ఆదేశించారు.

భవన నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలి

జేసీ దినేష్‌కుమార్‌

గుంటూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ భవననిర్మాణాలకు స్థలాలను గుర్తించాలని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ, రైతుభరోసా) ఏఎస్‌ దినేష్‌కు మార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో జిల్లాలో రైతుభరోసా కేంద్రాలు, నియోజకవర్గాలలో అగ్రి ల్యాబ్‌లు, సచివాలయాలు, ఇతర భవన నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలని జేసీ ఆదేశించారు. ఆయాశాఖల జిల్లా అధికారులు ఇంజనీరింగ్‌ సిబ్బందితో చర్చించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించాలన్నారు. డివిజ న్‌లవారీగా ఆర్డీవోలతో సమీక్షించాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-03-25T05:12:09+05:30 IST