రెండు నెలల రేషన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2021-03-05T06:06:50+05:30 IST

గత నెలలో రేషన్‌ సరుకులు తీసుకోలేకపోయిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

రెండు నెలల రేషన్‌ పంపిణీ

జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

గుంటూరు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గత నెలలో రేషన్‌ సరుకులు తీసుకోలేకపోయిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ఫిబ్రవరి, మార్చి నెలల సరుకులు కలిపి తీసుకోవచ్చన్నారు.  ఎండీయూ ఆపరేటర్‌ వద్ద ఆధార్‌కార్డు నెంబరు చెబితే వారు రెండు నెలల సరుకులు పంపిణీ చేస్తారని తెలిపారు. మార్చి 20 వరకు సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 6న ఒక్క రోజే విరామం ఇచ్చి శనివారం నుంచి యఽథావిధిగా పంపిణీ చేస్తామన్నారు.  సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి పద్మశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-05T06:06:50+05:30 IST