అమరావతే ఏకైక రాజధాని

ABN , First Publish Date - 2021-11-24T05:17:26+05:30 IST

ఆంధ్రప్రదేశకు అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని జనసేన నేతలు డిమాండ్‌ చేశారు.

అమరావతే ఏకైక రాజధాని
మాట్లాడుతున్న బోనబోయిన, గాదె తదితరులు

జనసేన నేతల డిమాండ్‌

గుంటూరు, నవంబరు 23: ఆంధ్రప్రదేశకు అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని జనసేన నేతలు డిమాండ్‌ చేశారు. మంగళవారం లాడ్జి సెంటర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచన తక్షణం విరమించుకోవాలని  కోరారు.  రాజధాని అమరావతి కోసం రైతులు  34 వేల ఎకరాల భూమిని ఇచ్చారు. అమరావతి కలను సర్వనాశనం చేసిన సీఎం జగన, రైతులను నడిబజారులో నిలబెట్టారు. మూడు రాజధానులు బిల్లును ఉప సంహరించుకొన్న ప్రభుత్వానికి బుద్ది వచ్చిందని సంతోషిస్తుంటే, బిల్లును సవరించి మరోసారి మూడు రాజధానుల ప్రతిపాదన అసెంబ్లీలో ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గు చేటని  వారు మండిపడ్డారు.   సమావేశంలో జనసేన నాయకులు కొప్పుల కిరణ్‌, అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-24T05:17:26+05:30 IST