విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు

ABN , First Publish Date - 2021-10-29T05:26:02+05:30 IST

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎలుగెత్తి చాటేలా జనసైనికులు సన్నద్ధం కావాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు
ప్రసంగిస్తున్న బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌

జనసేన నేత బోనబోయిన వెల్లడి

గుంటూరు. అక్టోబరు 28: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎలుగెత్తి చాటేలా జనసైనికులు సన్నద్ధం కావాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. జనసేన ఆధ్వర్యంలో విశాఖలో ఉక్కు కార్మికులకు మద్దతుగా 31న జరగబోయే దీక్ష కార్యాచరణపై గురువారం గురువారం స్థానిక ఓ హోటల్‌లో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి పది వేల మంది నేతలు, కార్యకర్తలు తరలివచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీదుర్గ, నాయకులు పాకనాటి రమాదేవి, బిట్రగుంట మల్లిక, కటకంశెట్టి విజయలక్ష్మి, ఉప్పు వెంకటయ్య, నారదాసు రామచంద్రప్రసాద్‌, లక్ష్మణ్‌, నక్కల వంశీకృష్ణ, కొర్రపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T05:26:02+05:30 IST