బెదిరింపులకు పాల్పడటం తగదు : టీడీపీ

ABN , First Publish Date - 2021-09-02T14:05:41+05:30 IST

ప్రజల ఏమైనా మాట్లాడితే..

బెదిరింపులకు పాల్పడటం తగదు : టీడీపీ

వినుకొండ: ప్రజల ఏమైనా మాట్లాడితే అంతుచూస్తాం, నాలుక కోస్తాం అని మాట్లాడటం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు తగదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షమీమ్‌ఖాన్‌ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బొల్లా ఆగస్టు 31వ తేదీన వైసీపీ కార్యాల యంలో టీడీపీ నాయకులనుద్దేశించి మాట్లాడిన పరుషపదాలపై పట్టణంలో చర్చనీ యాంశంగా ఉందన్నారు. ఇళ్ల లబ్ధిదారుల వద్ద నుంచి రూ.50 వేలు అడుగుతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఏజీపీ సైదారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. సురేష్‌మహాల్‌రోడ్డులో కొందరు రోజువారి సంపాదనతో బతికే నిరుపేదలు ఉన్నారని, అభివృద్ధి చేయాల్సి వస్తే స్థానికులతో చర్చించి వారికి ప్రత్యామ్నాయం చూపిస్తే కోర్టుకు వెళ్లేవారు కాదని, వారి హక్కుల కోసం కోర్టుకు వెళ్లారన్నారు. మరో సీనియర్‌ నాయకుడు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గన్నమనేని వెంకయ్య మాట్లాడుతూ తాడేపల్లి నుంచి వచ్చి స్ర్కిప్ట్‌ చదువుతున్నావే తప్ప, నీ కంటే ఇక్కడ ఘనంగా బతికిన వారేనని, ఎవరిని పడితే వారిని ఎట్లాపడితే అట్లా మాట్లాడటం తగదన్నారు. సీనియర్‌ న్యాయవాది రామ కోటేశ్వరరావు, దాసరి కోటేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సౌదాగర్‌ జానీబాషా, పి.వి.సురేష్‌, విశ్వనాథం, గోరంట్ల హనుమంతరావు, గద్దె వీరమస్తాన్‌రావు పాల్గొన్నారు.  


Updated Date - 2021-09-02T14:05:41+05:30 IST