నాటు పడవల్లో తరలిస్తున్న మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-07-13T04:47:35+05:30 IST

కృష్ణానదిలో నాటు పడవలద్వారా అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డీఎస్పీ ప్రసాద్‌ తెలిపారు.

నాటు పడవల్లో తరలిస్తున్న మద్యం స్వాధీనం
మాట్లాడుతున్న గురజాల డీఎస్పీ ప్రసాద్‌, సీఐ ఉమేష్‌, ఎస్‌ఐలు బాలనాగిరెడ్డి, రహంతుల్లా

దాచేపల్లి, జూలై 12: కృష్ణానదిలో నాటు పడవలద్వారా అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డీఎస్పీ ప్రసాద్‌  తెలిపారు. దాచేపల్లి పోలీసుస్టేషన్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని రామాపురం సమీపంలో కృష్ణానదిలో నాటు పడవల ద్వారా తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో దాడిచేశామన్నారు. ఈ సందర్భంగా 3,012 సీసాలు పట్టుబడ్డాయని, వీటి విలువ రూ.3లక్షల వరకు ఉంటుందని వివరించారు. పట్టుబడిన మద్యంతోపాటు మూడుకార్లు స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కారంపూడికి చెందిన వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు.   


Updated Date - 2021-07-13T04:47:35+05:30 IST