8,246 నకిలీ మద్యం సీసాల స్వాధీనం

ABN , First Publish Date - 2021-03-24T05:35:43+05:30 IST

మండలంలోని ములకలూరు క్రాస్‌రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున తరలిస్తున్న 8,246 నకిలీ మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు.

8,246 నకిలీ మద్యం సీసాల స్వాధీనం

నరసరావుపేట లీగల్‌, మార్చి 23: మండలంలోని ములకలూరు క్రాస్‌రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున తరలిస్తున్న 8,246 నకిలీ మద్యం సీసాలను  పోలీసులు పట్టుకున్నారు. నరసరావుపేట స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సూపరింటెండెంట్‌ వేంపల్లె చంద్రశేఖరరెడ్డి తెలిపిన వివరాలివి.. ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలేనికి చెందిన ఉసర్తి హరికృష్ణ, కుంభా శ్రీనివాసరావు ఓ వాహనంలో నకిలీ మద్యాన్ని తరలిస్తుండగా సిబ్బంది దాడి చేసిన పట్టుకున్నట్లు తెలిపారు. వీరి వాహనానికి ఎస్కార్ట్‌గా రెండు మోటారు సైకిళ్లపై వజ్జా శ్రీనివాసరావు, హరికృష్ణ వచ్చారని, దాడుల సమయంలో వారు పారిపోయారని తెలిపారు. నకిలీ మద్యం సూత్రధారి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బూచేపల్లి గ్రామానికి చెందిన బొమ్మిశెట్టి బాబూరావుగా గుర్తించామన్నారు.  దాడుల్లో నరసరావుపేట స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సీఐ కసుకుర్తి కర్ణ, సత్తెనపల్లి సీఐ మరయ్య, సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు.  


Updated Date - 2021-03-24T05:35:43+05:30 IST